Meghalaya Earthquake: మేఘాలయలోని తురాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రత నమోదైందని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై సమాచారం లేదని చెప్పారు. సోమవారం ఉదయం 06.32 నిమిషాలకు ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు. తురాకు తూర్పు-ఈశాన్య దిశగా 43 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని పేర్కొన్నారు.
మరోవైపు, టిబెట్, తుర్కియే దేశాల్లో భూప్రకంపనలు వచ్చాయి. సోమవారం తెల్లవారుజామున 4:01 గంటలకు టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు.
ఆదివారం అర్థరాత్రి తూర్పు తుర్కియే.. వాన్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. వాన్‌లోని తుస్బా జిల్లాకు సమీపంలో రాత్రి 9:35 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టాలపై సమాచారం లేదని టర్కీ ఆరోగ్య మంత్రి చెప్పారు.