తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారులో మంటలు- మాజీ సీఎం కుమారుడు సజీవ దహనం - మేఘాలయా అసిస్టెంట్ ప్రొఫెసర్​ కన్నుమూత

కారులో మంటలు (Car Accident News) చెలరేగి మాజీ సీఎం కుమారుడు అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మేఘాలయలోని రి-భోయ్​ జిల్లాలో జరిగింది.

son of former CM dead as car catches fire
మాజీ సీఎం కుమారుడు సజీవదహనం

By

Published : Oct 3, 2021, 1:04 PM IST

కారులో మంటలు చెలరేగిన (Car Accident News) ఘటనలో మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి ఈకే మౌ​లాంగ్​ కుమారుడు ఫెర్డినాండ్ బాన్షన్ లింగ్డో సజీవ దహనమయ్యారు. ఈ ఘటన రి-భోయ్​ జిల్లాలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇంఫాల్​లోని కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా ఫెర్డినాండ్ బాన్షన్ లింగ్డో పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈయన ప్రసుత్తం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న జార్జి లింగ్డో సోదరుడని తెలిపారు.

హీల్లాంగ్​- గువాహటి జాతీయ రహదారిపై ఉన్న ఉమ్రన్​ వద్ద ప్రమాదానికి గురైన కారును పోలీసులు గుర్తించారు. ఫెర్డినాండ్ బాన్షన్ లింగ్డో చనిపోయిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి:పాక్​ నుంచి జమ్మూకు డ్రోన్​ ద్వారా ఆయుధాలు!

ABOUT THE AUTHOR

...view details