తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గణతంత్ర వేడుకల ఏర్పాట్లపై సమీక్ష - ఎస్.ఎన్ శ్రీవాస్తవ

దేశ రాజధానిలో జరగనున్న గణతంత్ర వేడుకలపై దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్ శ్రీవాస్తవ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లపై ఆయన దృష్టి సారించారు.

review by delhi police commissioner
గణతంత్ర వేడుకలపై దిల్లీ పోలీస్ కమిషనర్ సమీక్ష

By

Published : Jan 17, 2021, 5:30 AM IST

జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు సన్నద్ధతపై దిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. రైతు ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

అడుగడుగునా అప్రమత్తం..

చైన్​ స్నాచింగ్ ముఠాలు, మాదకద్రవ్యాలు, జూదం వంటి వ్యవస్థీకృత నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించేందుకు పోలీసు స్టేషన్లన్నీ ప్రత్యేక కార్యాచరణ కలిగి ఉండాలని కమిషనర్ సూచించారు. పెట్రోలింగ్​ను పెంచాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:'వారిని తొలగించండి'- సుప్రీంకు రైతుల విజ్ఞప్తి

ABOUT THE AUTHOR

...view details