తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూరగాయలతో పేపర్ తయారీ.. విద్యార్థి వినూత్న ప్రయత్నం.. త్వరలో నాచుతోనూ.. - ఉత్తర్​ప్రదేశ్ విద్యార్థి పేపర్ తయారీ స్యూస్

గడ్డి, కూరగాయలతో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థి పేపర్ తయారు చేశాడు. ఈ పేపర్​ రాయటానికి మాత్రమే కాక గ్రీటింగ్ కార్డ్స్ నుంచి చార్ట్ పేపర్ తయారీ వరకు ఉపయోగపడుతుందట.

organic paper from green vegetable waste and grass
గడ్డి, కూరగాయలతో పేపర్ తయారు చేసిన బాలుడు

By

Published : Nov 12, 2022, 5:45 PM IST

ఉత్తర్​ప్రదేశ్ మేరఠ్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి పర్యావరణహితమైన ఆవిష్కరణ చేశాడు. దివ్యం అనే బాలుడు.. కూరగాయలు, గడ్డితో ఆర్గానిక్ కాగితాన్ని తయారుచేశాడు. ఎల్ ఇంటర్నేషనల్ స్కూల్​లో ఎనిమిదో తరగతి చదువుతున్న దివ్యం.. అడవులను నరికివేయటం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోందనే భావనతో ఈ పేపర్​ను తయారు చేశాడు. ఈ పేపర్​ రాయటానికి మాత్రమే కాక గ్రీటింగ్ కార్డ్స్ నుంచి చార్ట్ పేపర్ తయారీ వరకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు.

విద్యార్థి తయారూ చేసిన పేపర్

వంటింట్లోని వ్యర్థాలతో ఈ పేపర్ తయారుచేశాడు దివ్యం. ఈ పేపర్ రాసేందుకు మాత్రమేకాక హాండ్​క్రాఫ్ట్స్ కోసం కూడా ఉపయోగపడుతుందని ఆ విద్యార్థి చెప్పాడు. తాను చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని.. తర్వాతి ప్రయోగంగా.. నాచు, ఎండిన ఆకులు, పువ్వులు, ఆకులతో పేపర్ తయారు చేస్తానని చెబుతున్నాడు.
విద్యార్థికి సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమట. కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తాడని దివ్యం సైన్స్ టీచర్ చెబుతున్నారు.

ఆర్గానిక్ పేపర్

ABOUT THE AUTHOR

...view details