Meerut Police Pistol Case : ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ పోలీసులుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడిని ఇరికించేందుకు అతడి బైక్‌లో పిస్టల్‌ను పోలీసులే కావాలనే ఉంచారని కొందరు మహిళలు ఆరోపించారు. అనంతరం ఆ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నటించి యువకుడిని అరెస్ట్ చేశారని ఆరోపణలు చేశారు. అసలేమైందంటే?
జిల్లాలోని ఖర్ఖోడా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖండ్రవలి గ్రామానికి చెందిన కొందరు మహిళలు.. ఐజీ కార్యాలయం ఎదుట బుధవారం ఆందోళన చేపట్టారు. మంగళవారం రాత్రి పోలీసులు తమ ఇంటికి చేరుకున్నారని మహిళలు తెలిపారు. బైక్ బ్యాగ్‌లో ఓ పోలీస్ కావాలనే ఏదో ఉంచి ఇంట్లో నిద్రిస్తున్న తమ కుటుంబ సభ్యుడు అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. యువకుడిని ఇరికించేందుకే చేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు చేశారు.
ఐజీకి చూపించిన సీసీటీవీ ఫుటేజ్‌లోని దృశ్యం Meerut Police Conspiracy : "పోలీసులు మంగళవారం రాత్రి ముందుగా మా ఇంటికి చేరుకున్నారు. మేము నిద్రిస్తున్న సమయంలో ఇంటి బయట ఉన్న బైక్ బ్యాగ్‌లో పిస్టల్‌ను ఉంచారు. ఆ తర్వాత ఏం తెలియనట్లు ఇంటి తలుపు కొట్టారు. తలుపు తీయగా.. ఇంట్లోకి వెళ్లి అంకిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మేం చెబుతున్నా పోలీసులు వినిపించుకోలేదు. మాపై దుర్భాషలాడారు" అని అంకిత్ కుటుంబసభ్యులు ఆరోపించారు. ఘటనానంతరం స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను గమనించామని.. అందులో పోలీసులే బైక్‌లో పిస్టల్‌ను పెట్టినట్లు గుర్తించామని చెబుతున్నారు.
గ్రామంలోని తమ కుటుంబానికి వేరే ఫ్యామిలీతో భూవివాదం నడుస్తోందని అంకిత్ సోదరి రాఖీ త్యాగి.. ఐజీ కార్యాలయంలో చెప్పింది. ఆ కుటుంబంతో పోలీసులు కుమ్మక్కయ్యారని.. అందుకే అంకిత్‌ను ఇరికించేందుకు పోలీసులు ఇలా చేశారని ఆరోపించింది. సీసీటీవీ ఫుటేజీని ఐజీకి చూపించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనంతరం ఐజీ.. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎస్‌ఎస్పీని ఆదేశించారు.
దెయ్యం కోసం దర్యాప్తు.. ఉద్యోగిని బెదిరించి రూ. 1.4 కోట్లు చోరీ
దెయ్యం దర్యాప్తు కోసం వచ్చిరూ.1.4 కోట్ల దోపిడీ చేసి పరారీలో ఉన్న ఏడుగురు పోలీసులపై ఉత్తర్‌ప్రదేశ్.. వారణాసి కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ మేరకు జడ్జి శక్తి సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో స్టేషన్ ఇన్ఛార్జ్తో పాటు ముగ్గురు ఎస్ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అయితే ఈ ఘటనపై వారణాసి జిల్లా భేలూపుర్ పోలీస్ స్టేషన్లో 12 మందిపై కేసు నమోదైంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.