తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇద్దరమ్మాయిల ప్రేమాయణం.. పెళ్లి కోసం పురుషుడిగా మారిన యువతి - రాజస్థాన్​ భరత్​ పుర్​లో యువకుడిగా మారిన మీరా

ఓ యువతి లింగమార్పిడి చేసుకుని యువకుడిలా మారింది. అనంతరం పెద్దల అనుమతితో మరో యువతిని పెళ్లిచేసుకుంది. ఈ ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​ జిల్లాలో జరిగింది.

meera became aarav in bharatpur after gender change
meera became aarav in bharatpur after gender change

By

Published : Nov 8, 2022, 12:11 PM IST

Updated : Nov 8, 2022, 1:27 PM IST

లింగమార్పిడి చేసుకుని మరీ యువతిని పెళ్లి చేసుకుంది మరో యువతి. రాజస్థాన్​లోని భరత్​పుర్​కు చెందిన​ మీరా కుంతల్​ అనే పీటీ టీచర్​ లింగమార్పిడి చేసుకుని పురుషుడిగా మారింది. తన విద్యార్థిని కల్పనను పెద్దల అనుమతితో పెళ్లి చేసుకుంది. మీరా నేషనల్​ లెవెల్​ ఛాంపియన్​ కాగా.. కల్పన కూడా కబడ్డీలో మంచి గుర్తింపు పొందిన ప్లేయర్.​

ఆరవ్, కల్పన

ఇదీ జరిగింది.. మీరా కుంతల్ (లింగమార్పిడి అనంతరం ఆరవ్)​.. నాగ్లా మోతి గ్రామంలోని ప్రభుత్వ సెకండరీ స్కూల్​లో పీటీ టీచర్​గా పని చేస్తోంది. అక్కడ అమ్మాయిలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుండేది. అయితే మీరా అడపిల్లలాగ పుట్టినా.. చిన్నప్పటినుంచి పురుష లక్షణాలు ఉన్నాయని ఆమె తండ్రి చెప్పారు. చూడటానికి ఆడవాళ్లలా కనిపించినా.. మీరాకు మాత్రం పురుషుల్లా జీవించాలని ఉండేది. దీంతో ఓ మానసిక వైద్యుడిని సంప్రదించగా.. ఆమెకు జెండర్​ డిస్ఫోరియా అనే వ్యాధి ఉందని నిర్ధరించారు. దీంతో లింగ మార్పిడి చేసుకునేందుకు నిర్ణయించుకుంది మీరా. దీనికి మీరా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. 2019 డిసెంబర్ 15 నుంచి లింగ మార్పిడి కోసం అనేక శస్త్ర చికిత్స చేయించుకుని ఆరవ్​గా మారింది. అయితే మీరా పీటీ టీచర్​గా ఉన్నప్పుడే కల్పన అనే అమ్మాయితో మంచి స్నేహం ఏర్పడింది. శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో కల్పన ఆరవ్​ను దగ్గరుండి చూసుకుంది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అనంతరం కుటుంబ సభ్యుల అనుమతితో నవంబర్ 4న పెళ్లి చేసుకున్నారు.

ఆరవ్, కల్పన

మీరా కోచ్​గా ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్న కల్పన రాష్ట్ర స్థాయిలో రాణించింది. ఆ తర్వాత ఇంటర్మీడియెట్​లో, డిగ్రీ స్థాయిలోనూ తన ఆటతో సత్తా చాటింది. 2023లో దుబాయిలో జరిగబోయే అంతర్జాతీయ ప్రో కబడ్డీ లీగ్​లోనూ పాల్గొననుంది. మీరా.. క్రికెట్​లో మూడు సార్లు, హాకీలో నాలుగుసార్లు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించింది. అనంతరం కబడ్డీ, వాలీబాల్​ కోచ్​గా కూడా పనిచేసింది. మీరా అక్కాచెల్లెళ్లు ఆరవ్​ను సోదరుడిగా భావించి రాఖీ కడుతున్నారు. వాళ్ల పిల్లలు ఆరవ్​ను ఇప్పుడు మామయ్య అని పిలుస్తున్నారు.

ఇవీ చదవండి :హిజాబ్​ వస్త్రాన్ని తగలబెట్టి ముస్లిం యువతుల నిరసన

పంటి చికిత్స కోసం ఆస్పత్రికి.. పేపర్ చదువుతూ కుప్పకూలిన వ్యాపారి

Last Updated : Nov 8, 2022, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details