Which Mee Seva Services We Get on Mobile :గతంలో ఏదైనా ధ్రువీకరణ పత్రం పొందాలన్నా.. ఏవైనా సేవలు పొందాలన్నా.. ఆయా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. కానీ.. "మీ సేవ" కేంద్రాలు ఏర్పాటైన తర్వాత పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం సొంత ఊరిలోనే "మీ సేవ" కేంద్రాల ద్వారా జనాలు కావాల్సిన పనులు పూర్తి చేసుకుంటున్నారు. అయితే.. మారుతున్న టెక్నాలజీ అవకాశాలను మరింత విస్తృతం చేస్తోంది. ఈ క్రమంలోనే.. "మీ సేవ" కేంద్రాలకు వెళ్లకుండా పలు రకాల సేవలను ఫోన్ ద్వారానే పొందే అవకాశం వచ్చింది. మరి.. మీ సేవ కేంద్రాలు(Mee Seva Centers) ఏయే సేవలు అందిస్తున్నాయి? మొబైల్ ద్వారా ఎలాంటి సేవలను పొందవచ్చు? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Mee Seva Services on Mobile in Telangana :'మీ సేవ' ద్వారా ప్రజలకు ఆన్లైన్ ద్వారా.. వివిధ రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ "మీ సేవ" కేంద్రాలు ప్రస్తుతం సుమారు 150కి పైగా ప్రభుత్వ, 600లకు పైగా ప్రైవేట్ కార్యకలాపాలకు సంబంధించిన ఆన్లైన్ చెల్లింపుల సేవలను అందిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల, గ్రామీణ కేంద్రాల్లో కొన్ని వేల సంఖ్యలో ఉన్న ఫ్రాంచైజ్ కేంద్రాల ద్వారా ఆన్లైన్ సేవలను తెలంగాణ సర్కార్ అందిస్తోంది. ఆ సేవలను ఓసారి చూస్తే..
Birth Certificate Telangana : జనన ధ్రువీకరణ పత్రం పొందడం ఎలా.. ?
"మీ సేవ" ద్వారా అందే సేవల జాబితా :
- ఆధార్
- వ్యవసాయం
- సీడీఎంఏ
- పౌర సరఫరాలు
- పరిశ్రమల కమిషనరేట్
- ఫ్యాక్టరీల శాఖ
- పోలీసు శాఖకు సంబంధించిన సేవలు
- విద్యకు సంబంధించిన సేవలు
- ఎన్నికలకు సంబంధించిన వివరాలు
- ఉపాధికి సంబంధించిన అంశాలు
- మునిసిపాలిటీ
- గృహ
- ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు
- సాధారణ పరిపాలనకు చెందిన వివరాలు
- మున్సిపల్ అడ్మిన్ శాఖకు చెందిన సేవలు
- పరిశ్రమల ప్రోత్సాహకాలు కొత్తవి
- ఎన్పీడీసీఎల్
- గ్రామీణాభివృద్ధికి సంబంధించిన సేవలు
- సామాజిక సంక్షేమంతో పాటు తదితర సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా పొందవచ్చు.
మీ సేవ కేంద్రాల ద్వారా పొందే ప్రయోజనాలివే :
- ఆధార్(Aadhaar Card), నివాస రుజువు, రాబడి, దేశ రికార్డులకు సంబంధించిన సేవలు సులభంగా పొందవచ్చు.
- కుల, వర్గ, ఆర్థిక నేపథ్యాలకు అతీతంగా అందరికీ అన్ని ప్రభుత్వ సేవలను అందిస్తాయి.
- రాష్ట్రంలోని 90 మిలియన్లకు పైగా నివాసితులకు ప్రజా సేవలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ప్రభావవంతంగా అందించబడుతున్నాయి.
- మీ సేవ కేంద్రాలు అన్ని ప్రభుత్వ శాఖలు, అధికారాల మధ్య విశ్వసనీయమైన ఇంటర్‌ఫేస్‌ను సెటప్ చేస్తాయి.