మోకాళ్లు, కీళ్ల నొప్పులు వస్తే ఆస్పత్రికి వెళ్తాం. అక్కడ వైద్యులు ఇచ్చిన మందులను వాడుతాం. అలాగే కొందరు ఆయుర్వేద మందులను ఉపయోగిస్తారు. కానీ కర్ణాటక చామరాజనగర్ ప్రజలు మాత్రం జాతీయ రహదారిపై ఉన్న రాయి దగ్గరకు వెళుతున్నారు. ఆ రాయికి మొక్కితే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయంటున్నారు. ఆ కథెంటో ఓ సారి తెలుసుకుందాం.
ఇదీ కథ..
యలందూర్ నుంచి మాంపల్లి వైపు వెళ్తున్న జాతీయ రహదారిపై ఓ రాయి చాలా ఏళ్లుగా ఉంది. మోకాళ్ల, నడుము, కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని నమ్ముతున్నారు. ఈ మార్గం గుండా ప్రయాణించే వాహనదారులు, కూలీలు సైతం ఇక్కడకు దిగి మొక్కుతున్నారు. అక్కడ నారికల్లు మారమ్మ అనే దేవత ఉందని స్థానికులు చెబుుతున్నారు.