Nursing Student Shirisha Murder in Vikarabad :రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన పారామెడికల్ విద్యార్థిని శిరీష హత్య కేసులో మిస్టరీ వీడలేదు. ఇప్పటివరకు హత్యగా అనుమానించిన పోలీసులు.. తండ్రి, బంధువులు చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. శిరీష మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్య నిపుణురాలు చెప్పిన విషయం విని.. కచ్చితంగా ఆమెది ఆత్మహత్యేనని పోలీసులు భావిస్తున్నారు. కానీ దీని వెనక ఉన్న కారణం మాత్రం స్పష్టంగా తెలియరావడం లేదు.
Medical Student Shirisha Murder Case news : ఇంట్లో జరిగిన గొడవేశిరీషను ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నా.. గ్రామస్థులు మాత్రం కచ్చితంగా ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. శిరీష ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు ఎలా గాయాలవుతాయని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను హత్య చేసిన వారెవరో తండ్రికి తెలుసని.. అన్నీ తెలిసీ.. అతను శిరీష మరణాన్ని ఆత్మహత్యగా చిత్రికరిస్తున్నాడని ఆరోపించారు. ఒక పక్క పోలీసులు కూడా ఆమెది ఆత్యహత్యే అని అంటున్నారు. అసలు శిరీషది హత్యా? ఆత్మహత్యా? అనే విషయం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు.
Vikarabad Shirisha Brutal Murder :వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందినశిరీష మృతదేహానికి ఆదివారం వైద్యాధికారిణి వైష్ణవి పర్యవేక్షణలో పోస్టుమార్టం జరిగిన అనంతరం.. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే శిరీష అక్క భర్త అనిల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆమె మృతదేహాన్ని మరోసారి పరిశీలించాలని పోలీసులు కోరడంతో వైద్యాధికారిణి కాడ్లాపూర్ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతోనే శిరీష మృతి చెంది ఉంటుందని పోలీసులకు, గ్రామస్థులకు ఆమె వివరించారు.