తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీకి 70 టన్నుల ఆక్సిజన్​ - Oxygen shortage in delhi

దిల్లీలో కరోనా విలయం సృష్టిస్తోన్న వేళ ఎక్స్​ప్రెస్​ రైలు ద్వారా 70 టన్నుల ఆక్సిజన్ చేరవేసినట్లు అధికారులు తెలిపారు. ఛత్తీస్​గఢ్​లోని రాయ్​గడ్​ నుంచి రెండు క్రితం రోజుల బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం ఉదయం దిల్లీకి చేరుకున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.

oxygen
ఆక్సిజన్​

By

Published : Apr 27, 2021, 11:38 AM IST

70 టన్నుల ఆక్సిజన్‌తో మొట్టమొదటి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం తెల్లవారుజామున దిల్లీకి చేరుకుంది. అక్కడి నుంచి దిల్లీ సర్కారు..హస్తినలో అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన ఆస్పత్రులకు ఈ ప్రాణవాయువు ట్యాంకర్లను తరలిస్తోంది. సర్‌ గంగారామ్ ఆస్పత్రికి 2 టన్నుల ప్రాణవాయువు సరఫరా చేసినట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్​లోని రాయ్‌గడ్‌ నుంచి రెండు రోజుల క్రితం బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలు.. మంగళవారం ఉదయం దిల్లీకి చేరుకున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. హస్తినలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ ఆక్సిజన్ కొరతతో ఇప్పటికే పదుల్లో రోగులు మరణించారు. ఈ పరిస్థితుల్లో అంగుల్‌, కాలీనగర్‌, రౌర్కెలా, రాయ్‌గడ్‌ నుంచి ఆక్సిజన్ తరలించేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది. మొదటి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్.. దిల్లీకి మంగళవారం తెల్లవారుజామున వెళ్లగా.. తదుపరి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌పై రైల్వే సమాచారం ఇవ్వలేదు.

ఇదీ చూడండి:ఆక్సిజన్​ లేక భర్తకు నోటితో ఊపిరూదిన భార్య

ABOUT THE AUTHOR

...view details