కరోనా మహమ్మారి విజృంభించిన వేళ వైద్యులు ఎదురొడ్డి నిలిచారని.. వైరస్ను లెక్కచేయకుండా ప్రపంచాన్ని రక్షించిన వాళ్లే 'సూపర్ మ్యాన్'లని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ త్వరలోనే దేశానికి రానున్నట్లు తెలిపారు.
''వైరస్ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది.. సూపర్ మ్యాన్లు. ఈ విషయం ప్రపంచానికి అర్థమైంది. సాయుధ బలగాల్లోనూ తమ విశేషమైన సేవలు అందించాలని రక్షణ మంత్రిగా కోరుతున్నా. వారికి దేశం మొత్తం రుణపడి ఉంది.''
- రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ఈ మేరకు కింగ్ జార్జ్స్ మెడికల్ కాలేజీ ప్రారంభ దినోత్సవంలోరాజ్నాథ్ సింగ్ మాట్లాడారు.దేశంలోని వైద్య రంగంలో కేజీఎంయూ మంచి స్థానంలో ఉందని మంత్రి అభినందించారు. మరో వందేళ్ల పాటు కోట్ల మంది రోగులకు చికిత్స అందించాలని ఆశించారు.