మే నెలలో రాష్ట్రాలకు అందిన వ్యాక్సిన్ డోసుల సంఖ్యపై వచ్చిన మీడియా నివేదికలు అవాస్తవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. 7.9 కోట్ల డోసుల్లో 5.8 కోట్ల డోసులు మాత్రమే ఈ నెలలో అందించారని కథనాలు వచ్చాయని పేర్కొంది. నిజానికి ఈ సమయంలో 6.16 కోట్ల డోసులు లబ్ధిదారులకు అందించినట్లు తెలిపింది. తప్పుడు కథనాలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
"జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం 120 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్లను రాష్ట్రాలకు అందిస్తుందని మీడియా నివేదికలు వెలువడ్డాయి. ఇది తప్పుడు నివేదిక.. ఎటువంటి ఆధారం లేకుండా వెలువడింది."
-కేంద్రం
ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల(జూన్ 1) ప్రకారం..
- మే 1-31 మధ్య మొత్తం 6.16 కోట్ల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగించాయి.
- మే 1-31 మధ్య రాష్ట్రాల వద్ద ఉన్న టీకా డోసులు 7.945 కోట్లు
- రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా డోసులు 1.64 కోట్లు