వ్యాక్సిన్ తయారీదారుల నుంచి కేంద్రం కొత్తగా వ్యాక్సిన్లు కొనుగోలు చేయట్లేదని వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. అవన్నీ అవాస్తవాలనేనని చెప్పింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ వద్ద నుంచి 11 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ సంస్థ నుంచి 5 కోట్ల కరోనా టీకా డోసులు కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ రూపంలో డబ్బులు చెల్లించామని స్పష్టం చేసింది.
"11 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఏప్రిల్ 28న రూ.1,732.50 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించాం. గతంలో ఆ సంస్థకు 10 కోట్ల టీకా డోసుల కోసం ఆర్డర్ చేయగా.. 8,744 కోట్ల డోసులను అందుకున్నాం. మే, జూన్, జులై నెలలకుగాను 5 కోట్ల కొవాగ్జిన్ టీకా డోసుల కోసం భారత్ బయోటెక్‌కు రూ.787.50 కోట్లను వందశాతం అడ్వాన్సు రూపంలో అందించాం. గతంలో రెండు కోట్ల కొవాగ్జిన్ టీకా డోసుల కోసం ఆర్డర్ చేయగా.. ఇప్పటి వరకు 0.8813 కోట్ల టీకా డోసులు అందుకున్నాం. భారత ప్రభుత్వం కొత్తగా టీకా డోసులను ఆర్డర్ చేయటం లేదనే వార్తలు అవాస్తవాలు.
- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ