విజయవంతంగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత అథ్లెట్లు సాధించిన పతకాలు దేశాన్ని గర్వించేలా చేశాయని కొనియాడారు. విశ్వక్రీడలను విజయవంతంగా నిర్వహించిన జపాన్ ప్రభుత్వాన్ని పీఎం మెచ్చుకున్నారు.
భారత క్రీడా వ్యవస్థను అట్టడుగు స్థాయిలో మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. కొత్త ప్రతిభావంతులు పుట్టుకొచ్చేలా కృషి చేయాలని తెలిపారు.
తాజా ఒలింపిక్స్‌లో భారత్ ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు రాగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను అధిగమించింది.