మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ జయంతి సందర్భంగా నేడు.. 'అటల్ బిహారీ వాజ్పేయీ స్మారక వార్షిక ఉపన్యాసాన్ని' విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించనున్నట్లు మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.
"వాజ్పేయీ 96వ జయంతి సందర్భంగా విదేశీ విధానంపై అమెరికా-భారత్ వాణిజ్య మండలి అధ్యక్షురాలు నిశా దేశాయ్ బిస్వాల్ ఉపన్యసిస్తారు. భారత విదేశీ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి." అని ట్వీట్ చేశారు జైశంకర్.