తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజాస్వామ్యంపై భారత్​కు మీ పాఠాలు అనవసరం' - విదేశాంగ అధికార ప్రతినిధి

ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్న దేశాల్లో భారత్​ ర్యాంకును 'పాక్షిక స్వేచ్ఛాయుత' స్థితికి తగ్గించడంపై భారత్​ మండిపడింది. ఈ మేరకు ఫ్రీడమ్ హౌస్ అనే ఎన్​జీఓ నివేదికను విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పుపట్టింది. ఆ సంస్థకు నిధులు సమకూర్చిన అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశం ఉత్తమ ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తోందని స్పష్టం చేసింది.

MEA slams Freedom House over 'partly free' country downgrade
భారత్​లో ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంది

By

Published : Mar 6, 2021, 2:53 PM IST

భారత్​ను 'పాక్షిక స్వేచ్ఛాయుత' ప్రజాస్వామ్య దేశంగా తగ్గిస్తూ ఫ్రీడమ్ హౌస్ అనే ఎన్​జీఓ ఇచ్చిన నివేదికపై విదేశాంగ మంత్రిత్వ శాఖ మండిపడింది. ఆ సంస్థకు నిధులు సమకూర్చిన అమెరికాపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్​ ఉత్తమ ప్రజాస్వామ్య విధానాలను అవలంబిస్తోందని ఇతరుల నీతి సూక్తులు పాటించే స్థితిలో లేదని స్పష్టం చేసింది.

దురుద్దేశంతోనే నివేదిక..

డెెమొక్రసీ వాచ్​డాగ్​ 'ఫ్రీడమ్​ హౌస్​' అనే అంతర్జాతీయ సంస్థ.. భారతదేశాన్ని స్వేచ్ఛాయుత స్థానం నుంచి పాక్షిక స్వేచ్ఛ కలిగిన దేశంగా కుదించింది. అదే సమయంలో ఇక్కడ పౌరహక్కుల కోసం నిరంతర సంఘర్షణ జరుగుతోందని తన నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను రాజకీయ దురుద్దేశాలతో కూడిన నిరాధారమైన ఆరోపణలుగా భారత విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ అభివర్ణించారు. భారతదేశ పటాన్ని తప్పుగా చిత్రీకరించడంపైనా మండిపడ్డారు.

''భారతదేశంలో బలమైన ప్రజాస్వామ్యం వేళ్లూనుకుంది. ఉత్తమ పద్ధతులను పాటిస్తున్నాం. ఇతరుల ఉపన్యాసాలు వినే స్థితిలో భారత్​ లేదు.''

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ అధికార ప్రతినిధి.

కరోనాపై పోరులో ముందున్న భారత్​.. ప్రపంచ దేశాల మన్ననలు పొందిందని శ్రీవాత్సవ తెలిపారు. అధిక రికవరీ రేటుతో పాటు.. తక్కువ మరణాల నమోదుపై ప్రశంసలు వెల్లువెత్తాయని వివరించారు.

ఇదీ చదవండి:'పాక్​తో ​సాధారణ సంబంధాలను కోరుకుంటున్నాం'

ABOUT THE AUTHOR

...view details