బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి తల్లి (Mayawati's mother news) రామ్రతి (92) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో దిల్లీలోని ఓ ఆస్పత్రిలో శనివారం.. ఆమె మృతి చెందారు. విషయం తెలియగానే దిల్లీకి బయలుదేరారు మాయావతి. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నాయని బీఎస్పీ వర్గాలు తెలిపాయి.
Mayawati Mother: బీఎస్పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం - మాయావతి తల్లి
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తల్లి (Mayawati's mother news) రామ్రతి (92) కన్నుమూశారు. గుండెపోటుతో దిల్లీలోని ఆస్పత్రిలో మరణించినట్లు (Mayawati Mother) పార్టీ వర్గాలు తెలిపాయి.
మాయావతి తల్లి మృతి
రామ్రతి మృతిపై (Mayawati Mother) ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా సంతాపం తెలిపారు. బీఎస్పీ నాయకులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాయావతి తండ్రి ప్రభూ దయాల్ (95) గత ఏడాదే మృతి చెందారు.
ఇదీ చదవండి:గోమూత్రం, పేడతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం: సీఎం
Last Updated : Nov 14, 2021, 10:01 AM IST