బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ -భాజపా పొత్తు సాధ్యపడదని స్పష్టం చేశారు. సమాజ్వాదీ పార్టీ పతనం కోసం అవసరమైతే భాజపాకు లేదా ఇతర పార్టీకి ఓటు వేస్తానని మాయావతి గత వారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపటంతో వాటికి వివరణ ఇచ్చారు మాయావతి .
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు తన వ్యాఖ్యలను స్వలాభాలకోసం ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ఓటు బ్యాంకే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు.
"అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..కానీ కులాలు,మతాలతో రాజకీయాలు చేసే పార్టీలకు మద్దతివ్వను. ముస్లింలకు మా పార్టీ ఎప్పుడూ ద్రోహం చేయలేదు. మా పాలన కాలంలో హిందూ-ముస్లిం అల్లర్లు లేవు. రానున్న ఉప ఎన్నికల్లో ఇద్దరు ముస్లింలకు మా పార్టీ నుంచి టికెట్ ఇచ్చాం."