భారత్లో కరోనా కేసుల సంఖ్య శనివారం అమాంతంగా పెరిగింది. 83 రోజుల్లో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కొవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో.. దేశంలో కరోనా కొత్త వేవ్ వచ్చే అవకాశముందని.. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం సహా కరోనా నిబంధనలను పాటించడం వల్ల దానిని అడ్డుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
దేశంలో తాజాగా 24వేల 882 కొత్త కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. డిసెంబర్ 20 నుంచి ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి.
"కరోనా కేసులు గణనీయంగా వెలుగు చూస్తున్నాయి. ఈ ఉద్ధృతిని ఆపాలంటే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు టీకాలు వేయడాన్ని కూడా పెంచాలి."