దేశవ్యాప్తంగా ప్రజలు హోలీ వేడుకల కోసం సిద్ధమవుతున్నారు. శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర.. ఈ వేడుకలకు కాస్త ముందుగానే ప్రారంభించింది.
మథురలోని బర్సానాలో హోలీకి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రంగు నీళ్లతో పాటు.. పూలు, లడ్డూలతో పండగ చేసుకుంటారు. దీన్నే లడ్డూమార్ హోలీగా పిలుస్తారు. ఇందులో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఔత్సాహికులు వస్తుంటారు.