తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇదంతా చేసింది బిలియనీర్​ ఫ్రెండ్స్​ కోసమే' - ప్రియాంక గాంధీ

ప్రధాని నరేంద్ర మోదీ ఓ అహంకార ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ. ఉత్తర్​ప్రదేశ్ మథుర జిల్లా పలిఖేడాలో ఏర్పాటు చేసిన 'కిసాన్ మహాపంచాయత్​'లో పాల్గొని ప్రియాంక ప్రసంగించారు.

Priyanka calls PM 'arrogant', 'coward'
మోదీ... అసమర్థ, అహంకార ప్రధాని: ప్రియాంక

By

Published : Feb 23, 2021, 11:30 PM IST

మోదీ సర్కార్​పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. ప్రధాని మోదీ ఓ అహంకార ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర్​ప్రదేశ్​ మథుర జిల్లా పలిఖేడాలో నిర్వహించిన కిసాన్​ మహాపంచాయత్​కు ఆమె హాజరయ్యారు.

'బిలియనీర్ ఫ్రెండ్స్' కోసమే

సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులను 'ఆందోళన్ జీవులు'గా ప్రధాని అభివర్ణించటంపై ఆమె మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రైతు చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ.. తన 'బిలియనీర్ ఫ్రెండ్స్' కోసమే చట్టాలను తీసుకొచ్చారని ఆరోపించారు.

" అహంకార ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెబుతూ వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సమయం దగ్గర పడింది. ఆయన తీసుకొచ్చిన పాలసీలను ప్రశ్నిస్తే.. సమాధానం ఉండదు. కాంగ్రెస్​ వల్లే ఇంధన ధరలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సాగు చట్టాలు రద్దు అయ్యే వరకూ.. రైతుల పక్షాన పోరాడతాం. "

-- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ నేత

'రైతుల వద్దకు రాని ప్రధాని'

పవిత్రమైన మథుర నగరం.. ఎన్నో ప్రజా ఉద్యమాలకు వేదిక అన్నారు ప్రియాంక. రైతు ఉద్యమంలో ఇప్పటివరకు 215 మంది అన్నదాతలు మరణించారని పేర్కొన్నారు. ప్రపంచం మొత్తం పర్యటిస్తున్న ప్రధాని.. దిల్లీ సరిహద్దులో ఉద్యమం సాగిస్తోన్న రైతుల వద్దకు రాలేదని తీవ్ర విమర్శలు చేశారు. మరణించిన రైతులకు పార్లమెంట్​లో రాహుల్​ గాంధీ.. సంఘీభావం తెలుపుతుంటే.. ఎవ్వరూ నిల్చోకుండా అహంకార ధోరణి ప్రదర్శించారన్నారు.

బృందావన్​లోని బంకె బిహారీ ఆలయాన్ని సందర్శించిన ప్రియాంక
బంకె బిహారీ ఆలయంలో ప్రత్యేక పూజలు

కిసాన్ పంచాయత్​లో పాల్గొన్న తర్వాత ప్రియాంక గాంధీ బృందావన్​లోని బంకె బిహారీ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చదవండి :'ఆ బఫర్​జోన్​ ప్రకటనతో ప్రజల జీవనోపాధికి ఆటంకం'

ABOUT THE AUTHOR

...view details