Security Breach at Mamata Residence: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంటి వద్ద భద్రతా లోపం తలెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి కోల్‌కతా కాళీఘాట్‌లోని సీఎం నివాసంలోకి ప్రవేశించాడు. రాత్రంతా ఆ వ్యక్తి.. ఇంటి గోడపైనే మౌనంగా కూర్చొని ఉన్నట్లు తెలిసింది. ఆదివారం ఉదయం భద్రతా సిబ్బంది గుర్తించారు. అనంతరం.. ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ముఖ్యమంత్రి నివాసం చుట్టూ ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సీఎం మమతా బెనర్జీకి కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది. అయితే.. ఇంత నిఘా ఉన్నప్పటికీ.. ఆ వ్యక్తి అర్ధరాత్రి ఎలా వచ్చాడో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.