గుజరాత్ వడోదరలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
10 అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగాయి. ఆస్ప్రత్రిలోని రోగులను నిచ్చెన ద్వారా కిందకు దించారు.
గుజరాత్ వడోదర ఆసుపత్రి అగ్నిప్రమాద దృశ్యాలు.. ఈ ప్రమాదంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో టార్చీ లైట్ల వెలుతురులో రోగులను బయటకు తీసుకొచ్చారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన అధికారులు.. నివేదిక ఇవ్వాల్సిందిగా ఆసుపత్రిని ఆదేశించారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం