Fire Accident Moradabad: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల లోపల ఉన్న ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది.. మొరాదాబాద్‌లోని అమరుద్దీన్ అనే వ్యక్తి తన ఇంటి మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో ఉన్న వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అవి విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మరొకరు అగ్నిమాపక సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు. వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.