తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివాహితపై అత్యాచారం​.. ఆలస్యంగా వెలుగులోకి - వివాహితపై రేప్​.. ఆలస్యంగా వెలుగులోకి..

యూపీలో అత్యాచార ఘటనలు ఆగడం లేదు. తాజాగా ఓ వివాహితపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో దుండగుడు. ఈ ఘటన శుక్రవారం బయటపడింది. బాధిత మహిళ న్యాయం కోరుతూ పోలీసులను ఆశ్రయించగా.. కాపాడాల్సిన వారే నిర్లక్ష్యం వహించారని ఆమె ఆరోపించింది.

Married woman raped by paddy trader in UP's Bhadohi
వివాహితపై అత్యాచారం​.. ఆలస్యంగా వెలుగులోకి..

By

Published : Mar 5, 2021, 7:27 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహిత(30)పై వరి వర్తకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఠాణాకు వెళ్లగా.. న్యాయం చేయాల్సిన రక్షక భటులే తనను వెంబడించారని ఆరోపించింది.

అసలేం జరిగిందంటే.?

భదోహీలోని ఔరాయి గ్రామానికి చెందిన బడే లాల్​ బింద్​ అనే వరి వ్యాపారి.. అదే ఊర్లోని ఓ కుటుంబం వద్ద పదిహేను రోజుల క్రితం ధాన్యం కొనుగోలు చేశారు. సంబంధిత డబ్బులు వసూలు కోసం మహిళ.. బింద్​ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి, ఆమెను బంధించి అత్యాచారం చేశాడు బింద్​. తమకు ఇవ్వాల్సిన సొమ్ము చెల్లించకపోగా.. అత్యాచార విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.

అనంతరం.. ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ సదరు మహిళ స్థానిక పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించింది. ఈ మేరకు ఫిర్యాదు రాసి స్టేషన్​ అధికారికి ఇచ్చింది. తాను ఇచ్చిన పత్రాన్ని పోలీసులు చించేశారని, తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పింది.

ఇదీ చదవండి:యూపీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం

కేసు నమోదు..

ఆ తర్వాత.. తమకు న్యాయం చేయాలని కోరుతూ భదోహీ ఎస్పీని కలిశారు బాధిత కుటుంబ సభ్యులు. ఈ పూర్తి వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అత్యాచారం సహా.. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు విభాగాల కింద కేసు నమోదు చేసుకున్నట్టు గురువారం తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, పరారీలో ఉన్న వరి వ్యాపారి బింద్​ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

ఇదీ చదవండి:కల్తీసారా కేసులో 9 మందికి మరణశిక్ష

ABOUT THE AUTHOR

...view details