ఉత్తరప్రదేశ్లో మరో దారుణ ఘటన బయటపడింది. పీలీభీత్లోని ఓ వివాహితకు ముగ్గురు వ్యక్తులు మద్యం తాగించి.. అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు నిందితుల(పవన్ కుమార్, చోటె, ఉమేశ్)ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
వివాహితకు మద్యం తాగించి.. ఆపై..!
ఓ మహిళకు ముగ్గురు దుండగులు మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగు చూసింది.
వివాహితకు మద్యం తాగించి.. ఆపై ముగ్గురు అత్యాచారం
అత్యాచారం విషయంపై బాధిత మహిళ కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరు తమ పొరుగువారేనని.. తొలుత తనను వాళ్ల తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళతానని చెప్పినట్టు ఆమె పేర్కొంది. ఆ తర్వాత.. అతడితో పాటు మరో ఇద్దరు సన్నిహితులు కలిసి మద్యం తాగించి, తనపై అత్యాచారం చేశారని ఆరోపించింది. అనంతరం.. తనను నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోయినట్టు బాధితురాలు పేర్కొంది.
ఇదీ చదవండి:మృత్యుకోరల్లో మృగరాజు- సింహాలపై వైరస్ పంజా