తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళతో ఫ్రెండ్​షిప్.. బైక్​పై తీసుకెళ్లి గ్యాంగ్​రేప్.. చికిత్స పొందుతూ.. - కర్ణాటక మహిళ గ్యాంగ్​రేప్​

బతుకుతెరువు కోసం టార్ఫాలిన్​లు కుట్టుకుంటా జీవిస్తున్న ఓ మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు.. చికిత్స పొందుతూ మరణించింది. కర్ణాటకలో ఈ దారుణ ఘటన జరిగింది.

married woman Gang raped in Karnataka Victim died main accused arrested
married woman Gang raped in Karnataka Victim died main accused arrested

By

Published : May 27, 2023, 2:13 PM IST

కర్ణాటకలో ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలు.. చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్​ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాయ్​చూర్​ జిల్లాలోని సింధనూరు ప్రాంతంలో ఈ దారుణ ఘటన మే23న జరిగింది. బాధితురాలు.. టార్పాలిన్​ షీట్లు కుట్టుకుంటూ జీవిస్తోంది. ప్రధాన నిందితుడు మల్లప్ప.. బాధితురాలిలో ఇటీవలే స్నేహం పెంచుకున్నాడు. ఆ తర్వాత చాలాసార్లు శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో 23వ తేదీన మల్లప్ప.. ఆమెను బైక్​పై బలవంతంగా బయటకు తీసుకెళ్లాడు.

ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి.. బాధితురాలిపై మల్లప్ప సహా ముగ్గురు యువకులు.. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఇది గమనించిన గ్రామస్థుడు.. మహిళ కుమారుడికి సమాచారం అందించాడు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మహిళను సింధనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం బాధితురాలిని రాయచూర్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆమె మే 24న మహిళ మృతి చెందింది.

తన మరణానికి ముందు బాధిత మహిళ నిందితుల గురించి కుటుంబసభ్యులకు చెప్పింది. నిందితుడు మల్లప్ప సహా ముగ్గురు తనపై బలవంతంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. మహిళ ఇచ్చిన వాంగ్మూలం మేరకు కుమారుడు సింధనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రధాన నిందితుడు మల్లప్పను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విద్యుత్​ స్తంభానికి కట్టేసి చిన్నారులపై దారుణం..
ఉత్తర్​ప్రదేశ్​లో సిమెంట్ ఫ్యాక్టరీలో స్క్రాప్​ను దొంగిలించారనే నెపంతో ముగ్గురు చిన్నారులను విద్యుత్​ స్తంభానికి కట్టేసి గ్రామస్థులు దాడికి పాల్పడినట్లు సోషల్​ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. చిన్నారుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అమేఠిలోని గౌరీగంజ్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ పిల్లలు తిక్రియాలోని సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి స్క్రాప్ దొంగిలించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

సీరియల్​ కిల్లర్​కు జీవితఖైదు 30 మంది చిన్నారులపై హత్యాచారం
ఆరేళ్ల బాలికను కిడ్నాప్​ చేసి హత్యాచారం చేసిన కేసులో రవీందర్ కుమార్​ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది దిల్లీ రోహిణి కోర్టు. బాధితురాలి కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం సైతం ఇవ్వాల్సిందిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అదేశించింది. కాగా రవీందర్​ కుమార్.. గతంలోను ఈ తరహా దారుణాలకు పాల్పడ్డాడు. దాదాపు అతడు 30 మంది చిన్నారులను అపహరించి హత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీనిని నిందితుడు సైతం అంగీకరించాడు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details