Married Woman Gang Rape In Warangal: ఈరోజుల్లో ఆడవారి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకువచ్చిన సరే.. వారిపై అఘాయిత్యాలు మాత్రం తగ్గడం లేదు. నిత్యం ఏదో ఒక మూల అబలలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. తాజాగా వరంగల్ జిల్లాలోని జరిగిన ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఒక వివాహితపై అయిదుగురు యువకులు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారానికి పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది.
వరంగల్ జిల్లా మామునూరు ఏసీపీ తాళ్లపల్లి కృపాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పైడిపల్లికి చెందిన వివాహిత హనుమకొండలోని ఓ కర్రీ పాయింట్లో పని చేస్తుంది. గత నెల 20న స్నేహితురాలు నుంచి ఆరెపల్లిలో పని ఉందని ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ఈ విషయం భర్తకు చెప్పగా బైక్పై తీసుకువెళ్లి.. అక్కడ విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అప్పటికే అక్కడ ఆమె కోసం స్నేహితురాలు ఎదురు చూస్తోంది. అక్కడ వారిద్దరు కాసేపు ఎదురు చూసి.. కారు రావడంతో అందులో ఎక్కి వెళ్లిపోయారు. అందులో సురేశ్, నాగరాజు ఇద్దరు నిందితులు ఉన్నారు. ఆ కారు ములుగు జిల్లా అటవీ ప్రాంత సరిహద్దుకు వెళ్లిన తర్వాత ఆమె స్నేహితురాలు అక్కడే దిగిపోయింది.
Five Persons Who Raped Married Woman: ములుగు జిల్లా సరిహద్దు ప్రాంతంలో మరో ముగ్గురు ఎ. రమేశ్, బి. లక్ష్మణ్, బి. సుధాకర్లు కారులోకి ఎక్కారు. కారులో ఉన్న మహిళకు అప్పటికే మత్తు మందు ఇచ్చి ఉన్నారు. దీంతో ఆమె స్పృహ తప్పగా.. మెలకువ వచ్చే సరికి కారు మేడారం అటవీ ప్రాంతానికి చేరుకొంది. ఆ ప్రాంతంలో రవి, నాగరాజు, లక్ష్మణ్ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారితో పాటు వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు వారికి సహకరించారు. అనంతరం అత్యాచారం జరిగిన విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని ఆ అయిదుగురు నిందితులు ఆమెను బెదిరించారు. ఆ తర్వాత బాధితురాలిని వారు ములుగలో బస్సు ఎక్కించి.. పంపించేశారు.