Rajasthan rape news: రాజస్థాన్ చురూ జిల్లాకు చెందిన ఓ మహిళ తనపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. తన అశ్లీల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామని బెదిరించి.. నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు నిందితులపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Married woman raped: 27ఏళ్ల బాధితురాలు చెప్పిన వివరాలు ప్రకారం.. ఆమెకు 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. ఐదు నెలల క్రితం ఓ యువకుడితో ఆన్లైన్లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి రోజూ వీడియో కాల్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఆశ్లీల దృశ్యాలను అతడు రికార్డు చేశాడు. గతేడాది డిసెంబర్లో ఓ చోటుకు రమ్మని ఆమెకు ఫోన్ చేశాడు. అతను చెప్పిన చోటుకు బాధితురాలు వెళ్లింది. అనంతరం ఆమె ఫోన్ నుంచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను తన ఫోన్లోకి పంపించుకున్నాడు నిందితుడు. ఈ ఏడాది జనవరిలో నిందితుడు బాధితురాలి అత్తవారింటికి కూడా వెళ్లాడు. చనిపోయిన తన సోదరుడి స్నేహితుడని ఇంట్లో వాళ్లకి అతడ్ని పరిచయం చేసింది ఆమె. అయితే ఐదు రోజుల క్రితం మళ్లీ నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లాడు. అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పి బెదిరించి ఆమెను బయటకు తీసుకెళ్లాడు. నిందితుడు మొదట తన సోదరి ఇంటికి, ఆ తర్వాత బంధువుల ఇంటికి బాధితురాలిని తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గంగానగర్‌లోని తన స్నేహితుడు అస్లాం ఇంటికి కూడా తీసుకెళ్లాడు. అస్లాం కూడా ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అస్లాం బంధువుల ఇంటికి ఆమెను తీసుకెళ్లారు. అప్పటికే ఆమె కన్పించడం లేదని కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు పెట్టారు. దీంతో పోలీసులు రంగంలోని దిగి ఆమె అస్లాం బంధువుల ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకోగా.. తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు చెప్పింది.