Husband Offered His Wife To Others To Pay Loan: అప్పులకు బదులుగా భార్యను అప్పగించిన ఉదంతం రాజస్థాన్లోని చురు జిల్లాలో జరిగింది. తన భర్తే అప్పు ఇచ్చిన వారితో సంబంధాలు పెట్టుకోవాలని తనను బలవంతంగా చేశాడని.. చిత్రహింసలకు గురిచేస్తున్నాడని వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త, అత్తమామలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ మహిళ.. బుధవారం సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
అప్పులు చెల్లించలేక భార్యను అప్పగించిన భర్త! - Married woman alleges her husband sent her to others to pay loan
Husband Offered His Wife To Others To Pay Loan: అప్పులు చెల్లించలేక భార్యనే రుణదాతలకు అప్పగించాడు ఓ భర్త. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్లోని చురు జిల్లాలో జరిగింది. తాగుడుకు బానిసైన తన భర్త.. పరాయి వారితో సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది ఆ మహిళ.
ఇదీ జరిగింది: 2021 ఫిబ్రవరిలో చురులోని సదర్కు చెందిన వ్యక్తితో మహిళకు వివాహమైంది. పెళ్లైన తర్వాత వరకట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధించేవారు. భర్త మద్యానికి బానిసై.. గ్రామంలోని ప్రజల వద్ద రూ.5 లక్షలు అప్పులు చేశాడు. అప్పులు చెల్లించాలంటూ డబ్బులు ఇచ్చిన వారు అడగడం మొదలుపెట్టారు. దీంతో అప్పు ఇచ్చిన వారికి మహిళను అప్పగించారు కుటుంబ సభ్యులు. 2022 ఫిబ్రవరి 27న అప్పు ఇచ్చిన వారు తనను వేధింపులకు గురి చేశారని భర్తకు చెప్పింది. వారికి సహకరించకపోవడం వల్ల ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.
ఇదీ చదవండి:ప్రేమ జంటను చితకబాదిన గ్రామస్థులు.. అల్లుడిపై అత్తింటివారి దాడి