Marriages Are Made in Social Media : ఇప్పటివరకు ఎన్నోరకాల ప్రేమ కథల్ని భారతీయుులు చూశారు. కానీ, ఇటీవల బయటపడుతున్న లవ్ స్టోరీలు ఇప్పుడు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఒకరు పాకిస్థాన్ నుంచి భారత్‌కు రాగా మరొకరు భారత్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లారు. వీరే అనుకుంటే మరో మహిళ ఏకంగా ఖండాలు దాటి ప్రేమించిన ప్రియుడి కోసం ఏకంగా పొలాండ్ నుంచి భారత్‌కు వచ్చింది. వీరంతా వేర్వేరు నేపథ్యాలు ప్రాంతాలకు చెందిన మహిళలుకానీ, వీరిని కలిపింది మాత్రం ఒకే ఒక్క వేదిక అదే,సోషల్ మీడియా. అయినా, ఇందులో ఏముంది కొత్త అంటారా...? ఎందుకంటే సోషల్ మీడియా పరిధి విస్తృతం అయ్యాక లవ్ మ్యారేజ్లు పెరిగాయి. కదా వీరు అలానే చేసుకున్నారు అనుకోవచ్చు అని అనుకుంటారు అంతేనా. కానీ, ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రేమ పెళ్లిళ్లైతే కొంచెం వింతే. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది.
సీమా హైదర్:ఈ మహిళ కథ వింటే బాలీవుడ్ స్టోరీ సైతం సరిపోదేమో. ఎందుకంటే కొవిడ్ లాక్డౌన్ సమయంలో సరాదాగా ఆన్లైన్లో ఆడిన పబ్జీ ఆటతో భారత్‌లో ఉంటున్న సచిన్ మీనాతో పరిచయం ఏర్పడేలా చేసింది. క్రమంగా ఆ స్నేహం ప్రేమగా మారింది. అయితే, సీమాకు ఏడేళ్లలోపు వయసున్న నలుగురు పిల్లలు ఉన్నారు. సీమా భర్త ఉపాధి నిమిత్తం సౌదీలో పనిచేస్తున్నాడు. రెండేళ్లు ప్రేమించుకుని మొదటిసారిగా ఈ ఏడాది మార్చిలో నేపాల్‌లో కలుసుకున్నారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు. అలా తన నలుగురు పిల్లల్ని తీసుకుని మే13న నేపాల్ నుంచి బస్సులో భారత్‌కు చేరుకున్న సీమా గ్రేటర్ నొయిడాలోని సచిన్ వద్దకు చేరుకుంది.
తర్వాత సీమా పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు పోలీసులకు తెలియడంతో ఆరెస్టు చేయడం జరిగింది. తర్వాత విడుదల అయ్యింది. ఇప్పుడు పాకిస్థాన్ పౌరసత్వం విడిచిపెట్టుకుని భారతీయ పౌరసత్వం కోసం రాష్ట్రపతికి దరఖాస్తు కూడా చేసుకుంది. సచిన్ కుటుంబీకులు మాత్రం సీమాను పూర్తిగా నమ్మారు. ఇప్పుడు వారే తనకు సాయంగా ఉంటున్నారు. దీంతో ఈ ప్రేమ కథ రాష్ట్రపతి కోర్టులో ఉంది. కానీ, అనుకున్నంత సులభంగా పౌరసత్వం వచ్చే అవకాశాలు లేవు. దీంతో తదుపరి పరిణామాలపై ప్రస్తుతానికైతే ఉత్కంఠ నెలకొంది.
Read more:'సీమా హైదర్ పాకిస్థాన్ ఏజెంట్?'.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి
అంజు లవ్ స్టోరీ: సీమా సంఘటనను మరవకముందే మరో ప్రేమ పెళ్లి ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. అదే, అంజు లవ్ స్టోరీ. 35 ఏళ్ల భారతీయ మహిళ.. తన ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లా ఖాన్‌ను వెతుక్కుంటూ పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు చేరుకుంది. 2007లోనే వివాహమైన అంజుకి 15 ఏళ్ల కుమార్తె...6ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, అంజు ఫేస్బుక్ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన నస్రుల్లా ఖాన్‌తో ప్రేమలో పడింది. ప్రస్తుతం ఆ యువకుడు మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నాడు. అంజు తన భర్తకు రాజస్థాన్ చూడటానికి వెళ్తున్నాని చెప్పి పాకిస్థాన్‌కు వెళ్లి పోయింది.
అక్కడ తన పేరును ఫాతిమాగా మార్చుకుని స్నేహితుడైన నుస్రుల్లాను పెళ్లి కూడా చేసుకుందని అక్కడి అధికారులు వెల్లడించారు. అయితే, సీమా వెళ్లిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే అతడిని కలుసుకునేందుకు వాఘా బార్డర్ గుండా వెళ్లింది. అది కూడా ఆ దేశ వీసా ద్వారా..ఇప్పుడిదే తీవ్ర చర్చకు దారితీస్తోంది. భారత్‌లో ఉంటున్నఅంజుకు పాకిస్థాన్ వీసా కోసం ఎవరూ సాయం చేశారు? ఇంట్లో వారికి తెలియకుండానే అంత దూరం ఎలా ప్రయాణించింది...? అసలు, దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందన్న సందేహలు వ్యక్తమవుతున్నాయి.
Read more:ఫేస్బుక్ లవ్ .. ప్రియుడి కోసం పాక్‌కు వెళ్లిన భారత మహిళ
బార్బరా టిక్‌టాక్ లవ్: ఆ రెండు సంఘటనలకు భిన్నంగా ఉంటుంది... ఈ ప్రేమ జంట స్టోరీ. ఇది ఏకంగా ఖండంతరాలు దాటిన ప్రేమ కథా చిత్రం. పొలాండ్‌కు చెందిన 44 ఏళ్ల బార్బరా 27 ఏళ్ల షాదాబ్ కోసం భారత్‌కు వచ్చింది. షాదాబ్ మంచి డ్యాన్సర్ తన వీడియోలను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసేవాడు. అలా బార్బరాతో పరిచయం ఏర్పడింది. మెుదట్లో విదేశీ మహిళ అని భయపడినా... మెల్లగా పరిచయం పెంచుకుని ఇద్దరు ప్రేమలో పడ్డారు. దీంతో ప్రేమించిన వ్యక్తి కోసం బార్బరా 2021లో భారత్‌కు వచ్చేసింది. అయితే వీరు చట్టబద్దంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఆర్థికంగా స్థిరపడిన బార్బరాపై ఆధారపడి కూడా షాబాద్ పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక పోలేదు. కాబట్టి ఒక్కో ప్రేమకు...ఒక్కో కథ ఉందని అంటున్నారు నిపుణులు.