తన భర్త నిఖిల్ జైన్‌తో సంబంధాల విషయంలో తలెత్తిన వివాదంపై నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మౌనం వీడారు. నిఖిల్‌తో తనకు టర్కిష్ చట్టం ప్రకారం వివాహం జరిగిందని, అయితే ఇది భారత్‌లో చెల్లదని ఓ ప్రకటనలో తెలిపారు. కాబట్టి విడాకులు అన్న మాటే ఉండదని అన్నారు.
ఈ క్రమంలోనే నిఖిల్ జైన్‌పై పలు ఆరోపణలు చేశారు నుస్రత్. తన కుటుంబ ఆభరణాలు, ఇతర ఆస్తులను ఆయన దోచుకున్నారని ఆరోపించారు. తనకు తెలియకుండానే వివిధ ఖాతాల్లోని డబ్బును తీసుకున్నారని చెప్పారు. ఈ విషయంపై బ్యాంకు అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
నిఖిల్ జైన్- నుస్రత్ జహాన్ వివాదం ఏంటి?
ఇటీవల నిఖిల్-నుస్రత్ దంపతులకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపించాయి. నటి గర్భవతి అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరం ఆరు నెలల నుంచి విడిగా ఉంటున్నామని నిఖిల్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో నటుడు, భాజపా నేత యశ్ దాస్‌గుప్తాతో నుస్రత్ డేటింగ్ చేస్తున్నారంటూ పలు కథనాలు వస్తున్నాయి. నిఖిల్ విషయంపై వివరణ ఇచ్చిన నుస్రత్.. దాస్‌గుప్తాతో డేటింగ్‌పై మాత్రం స్పందించలేదు.
నిఖిల్ జైన్- నుస్రత్ జహాన్ ఎవరీ నిఖిల్ జైన్?
నిఖిల్ జైన్ ఓ వ్యాపారవేత్త. ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేసిన తర్వాత యూకేకు చెందిన ఎంఎన్సీలో పనిచేశారు. అనంతరం టెక్స్టైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు.
ఇదీ చూడండి:భాజపాలో చేరిన కాంగ్రెస్ కీలక నేత