తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నుదిటిపై సింధూరం పెట్టకుండా ముఖంపై చల్లిన వరుడు.. పెళ్లి క్యాన్సిల్​ చేసుకున్న వధువు! - marriege broken in chanduali up

వరుడి వికృతచేష్టలకు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది వధువు. దీంతో కల్యాణ మండపంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదుర్చారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

marriage broken in chandauli
marriage broken in chandauli

By

Published : May 6, 2023, 1:22 PM IST

ఇటీవల కాలంలో రకరకాల కారణాలతో ఎన్నో పెళ్లిళ్లు మండపంలోనే ఆగిపోతున్నాయి. అదనపు కట్నం, ప్రేమ వ్యవహారాలు బయటపడడం, అమ్మాయికి జుట్టు తక్కువగా ఉందని, అబ్బాయికి బట్ట తల ఉందంటూ వివిధ రకాల కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోవడం సర్వసాధారణమైంది! ఇలాంటి కారణాలతోనే ఎందరో యువతీయువకులు పెళ్లికి నిరాకరిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. ముహుర్తం సమయానికి వరుడు మద్యం సేవించి, వధువుపై సింధూరం చల్లిన కారణంగా మండపంలోనే పెళ్లికి నిరాకరించింది ఓ వధువు. చేసేదేం లేక వరుడు కుటుంబసభ్యులు.. తమ ఇంటికి వెళ్లిపోయారు.

అసలు ఏం జరిగిందంటే?
శుక్రవారం సాయంత్రం పెళ్లి జరగాల్సి ఉండగా.. వధూవరులు తన బంధుమిత్రులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి మండపానికి బయల్దేరారు. ఊరేగింపు మీర్జాపుర్ జిల్లా అహిరౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణిక్‌పూర్ వద్దకు చేరుకుంది. గ్రామంలోని ప్రజలు ఊరేగింపునకు ఘన స్వాగతం పలికారు. పెళ్లికి ముందు చేయాల్సిన పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో తాగిన మైకంలో పెళ్లి కుమారుడు.. వధువుకు సింధూరం పెట్టలేకపోయాడు. అందరూ ఎంత చెప్పినా వినకుండా వరుడు అక్కడి నుంచి జారుకున్నాడు.

భోజన కార్యక్రమం అనంతరం ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. కాసేపటికే వారి ఆచారం ప్రకారం వివాహ తంతు మొదలైంది. పురోహితుడు సంప్రదాయాలు, వ్యవహారాల గురించి చెబుతున్న సమయంలో.. మద్యం సేవించి ఉన్న వరుడు తనను తాను నియంత్రించుకోలేక పెళ్లికూతురుపై సింధూరం చల్లటం ప్రారంభించాడు. దీంతో వధువు.. వరుడిని ఆపే ప్రయత్నం చేసింది. ఆగ్రహానికి గురైన వరుడు, వధువుపై చేయి చేసుకున్నాడు. మండపంలో ఉన్న బంధువులు అందరూ వధూవరులిద్దరికీ సర్దిచేప్పే ప్రయత్నం చేశారు. అయినా వినిపించుకోని వధువు పెళ్లికి నిరాకరించి మండపం నుంచి ఇంట్లోకి వెళ్లి పోయింది. పరిస్థితి చేయి దాటిపోతుందని గమనించిన వరుడి బంధువులు అక్కడ నుంచి పరుగులు తీశారు. అప్రమత్తమైన వధువు బంధువులు.. వరుడిని, అతడి తండ్రిని అడ్డుకుని స్థానిక పోలీస్​ స్టేషన్​కు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న చాకరఘట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్​కు రప్పించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఇరు కుటుంబాల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. వివాహ నిర్వహణకు ఖర్చు చేసిన మొత్తాన్ని చెల్లించటానికి వరుడి కుటుంబం అంగీకరించింది. అలాగే వివాహ బంధాన్ని అక్కడితో రద్దు చేసుకుంటున్నట్లు రెండు కుటుంబాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details