హైదరాబాద్‌లో మార్గదర్శి 111వ శాఖ ప్రారంభించిన ఎండీ శైలజాకిరణ్ Margadarshi Chit Funds 111th Branch opened at Uppal : యువత ముందు చూపుతో మార్గదర్శి లాంటి సంఘటిత సంస్థల్లో పొదుపు చేసుకుంటే తమ ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ శైలజా కిరణ్(shailaja kiron) అన్నారు. హైదరాబాద్ ఉప్పల్ పీర్జాదిగూడలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ నూతన 111వ శాఖను ఎండీ చేతుల మీదుగా ప్రారంభించారు.
వినూత్న ఆలోచనలు, సరైన ప్రణాళికతోనే విజయాలు తథ్యం: శైలజా కిరణ్
జీవితంలో ప్రతి ఒక్కరు పొదుపు పాటించినట్లయితే ఆర్థికపరంగా ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని శైలజా కిరణ్ స్పష్టం చేశారు. తొలుత నూతన కార్యాలయంలో జ్యోతి ప్రజ్వలన చేసిన ఎండీ, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, ఈటీవీ భారత్ ఎండీ బృహతి హాజరయ్యారు. మార్గదర్శి సంస్థ అత్యంత నిబద్ధతతో చందాదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన సేవలందిస్తోందని శైలజా కిరణ్ తెలిపారు.
సంక్షోభ సమయంలో సైతం మార్గదర్శి(margadarsi) విజయవంతంగా నడుస్తోందని ఎండీ శైలజా కిరణ్ స్పష్టం చేశారు. మరో వందేళ్లు కూడా మార్గదర్శి దిగ్విజయంగా నడుస్తూ ప్రజా సేవలో నిమగ్నమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ఎస్.వెంకటస్వామి, ఉపాధ్యక్షులు పి.రాజాజీ, సాంబమూర్తి, జి.బలరామకృష్ణ, చీఫ్ మేనేజర్ సీవీఎం శర్మ, బ్రాంచి మేనేజర్ ఎస్.తిరుపతి, సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లు పాల్గొన్నారు.
"జీవితంలో ప్రతి ఒక్కరు పొదుపు పాటించినట్లయితే ఆర్థికపరంగా ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. యువత ముందు చూపుతో మార్గదర్శి లాంటి సంఘటిత సంస్థల్లో పొదుపు చేసుకుంటే తమ ప్రతి కోరికను నెరవేర్చుకోవచ్చు. సంక్షోభ సమయంలో సైతం మార్గదర్శి విజయవంతంగా నడుస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు సేవ చేసుకునే భాగ్యం మార్గదర్శి సంస్థకు సంతోషంగా ఉంది. మరో వందేళ్లు కూడా మార్గదర్శి సంస్థ దిగ్విజయంగా నడుస్తూ ప్రజా సేవలో నిమగ్నమవుతుంది". - సీహెచ్ శైలజా కిరణ్, ఎండీ, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్
Margadarshi Chit Funds Journey :మార్గదర్శి సంస్థ 1962 అక్టోబర్‌లో కేవలం ఇద్దరు ఉద్యోగులతో మొదలై ప్రస్తుతం 5వేల మంది సిబ్బంది, 110 బ్రాంచ్‌లతో అగ్రగామి సంస్థగా రూపుదిద్దుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటకల్లోనూ మంచి పేరు సంపాదించుకుంది. వినియోగదారులే దేవుళ్లు అన్న నినాదంతో అన్ని వర్గాల ఆశలకు మార్గదర్శకత్వం చేసేలా ఉండాలన్న లక్ష్యంతో రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థ ఆరు దశాబ్దాలుగా దాదాపు 60 లక్షల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది.
Margadarsi 109 Branch Opened in Kolar in Karnataka: "మార్గదర్శి సంస్థలో చిట్స్ వేయడం ఎంతగానో ఉపయుక్తం".. కోలార్‌లో మార్గదర్శి నూతన బ్రాంచ్ ప్రారంభం