చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతా చర్యలను భారత్ మరింత పటిష్ఠ పరుస్తోంది. పాంగాంగ్ సరస్సు వద్ద నౌకా దళానికి చెందిన ప్రత్యేక భద్రతాదళం 'మార్కోస్'ను భారత్ మోహరించింది. గత ఆరు నెలలుగా పాంగాంగ్ వద్ద పహారా కాస్తున్న వాయుసేన, ఆర్మీ ప్రత్యేక బలగాలకు తోడుగా మార్కోస్ దళాలు రంగంలోకి దిగాయి. తాజా మోహరింపుతో మార్కోస్ దళాలకు క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో పనిచేసే అనుభవంతో పాటు అక్కడే ఉన్న ఇతర దళాలతో సమన్వయం చేసుకునే అవకాశం లభిస్తుందని అధికారులు చెప్పారు.
సరిహద్దులో 'మార్కోస్' దళాల మోహరింపు - మార్కోస్ దళాలు
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి పాంగాంగ్ సరస్సు వద్ద 'మార్కోస్' దళాలను మోహరించింది ప్రభుత్వం. వాయుసేన, సైనిక బలగాలతో కలిసి మార్కోస్ పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సరిహద్దులో 'మార్కోస్' దళాల మోహరింపు
పాంగాంగ్ సరస్సులో సైనిక చర్యలు చేపట్టేందుకు త్వరలో మార్కోస్ ప్రత్యేక బలగాలకు బోట్లు ఇతర మౌలిక వసతులు అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:చైనా, పాక్‌ను ఒకేసారి ఎదుర్కోవడం ఎలా?