ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో మవోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. కియాముండా ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్న ట్రాక్టర్, జేసీబీకి నిప్పంటించారు. జిల్లాలో జరుగుతున్న ఎన్నికలను రద్దు చేయాలని లేఖ విడుదల చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
సమీప గ్రామాల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని ఘటనా స్థలంలో పోస్టర్‌ను అతికించి వెళ్లారు. సీఆర్పీఎఫ్ క్యాంపుల నిర్వహణ, నక్సల్స్ పేరుతో ప్రజలను నిర్బంధించి డబ్బులు వసూలు చేస్తూరని ఆరోపించారు.
బాంబు పేలి..
మవోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబు పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులతో సహా నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని మోదక్‌పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్కినార్ రోడ్డులో బెటాలియన్ బృందం ఆపరేషన్‌లో ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఐఈడీ బాంబు పేలింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:యూపీలో ఉగ్రకుట్ర భగ్నం.. ఆల్‌ఖైదా తీవ్రవాది అరెస్ట్