Maoists Blast Bridge In Jharkhand: ఝార్ఖండ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గిరిధ్ జిల్లా డుమ్రి పోలీస్‌స్టేషన్ పరిధిలోని వంతెనను పేల్చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక బారాగద గ్రామంలోని బరాకర్ నదిపై ఉన్న బ్రిడ్జ్‌ను పేల్చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో కొన్ని కరపత్రాలు లభ్యమైనట్లు పేర్కొన్నారు.
అంతకుముందు రెండు సెల్‌టవర్లను ధ్వంసం చేశారు నక్సలైట్లు. మావోయిస్టు టాప్ కమాండర్ ప్రశాంత్ బోస్, అతని సతీమణి శీలా మరాండీని గతేడాది నవంబర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.