మావోయిస్టు స్థావరం ధ్వంసం- ఆయుధాలు స్వాధీనం - maoist camp busted in odisha state
ఒడిశా నువాపడా జిల్లాలోని మావోయిస్టుల రహస్య స్థావరాన్ని ఛేదించాయి భద్రతాదళాలు. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
మావోయిస్టు స్థావరాన్ని ధ్వంసం చేసిన భద్రతాదళాలు
ఒడిశా నువాపడా జిల్లా పటదరహా అటవీ ప్రాంతంలోని మావోయిస్టుల రహస్య స్థావరాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం ఛేదించాయి. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.