దిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న వేళ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి.(Schools Reopen) 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు హాజరయ్యారు. 50 శాతం సామర్థ్యంతో విద్యాసంస్థలు పునఃప్రారంభించారు. స్క్రీనింగ్ చేసిన తర్వాతే విద్యార్థులను బడుల్లోకి(Covid rules in schools) అనుమతించారు. హస్తినలో 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు వారం రోజుల తర్వాత బడులు తెరవనున్నారు. అన్ని పాఠశాలల్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు, రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని కేజ్రీవాల్ ప్రభుత్వం స్పష్టంచేసింది.
దిల్లీలో పాఠశాలకు హాజరైన విద్యార్థులు దిల్లీలో విద్యార్థులకు స్క్రీనింగ్ చేస్తున్న దృశ్యం వర్షంలో గొడుగు పట్టుకుని పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు యూపీలో 1 నుంచి ఐదో తరగతి..
ఉత్తరప్రదేశ్‌లో(Schools reopening in up) ఇప్పటికే 9 నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులకు తరగతులు జరుగుతుండగా.. బుధవారం నుంచి 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులనూ అనుమతించారు. యూపీలో సెప్టెంబర్ 23 నుంచి 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లో భౌతికదూరం పాటిస్తూ పాఠశాలకు వెళ్తున్న చిన్నారులు ఉత్తర్‌ప్రదేశ్‌లో తరగతి గదికి హాజరైన చిన్నారులు ఉత్తర్‌ప్రదేశ్‌లో పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు కాన్పుర్‌లో విద్యార్థుల కోసం సిద్ధంగా ఉంచిన శానిటైజర్ కాన్పుర్‌లో ఓ పాఠశాలను అందంగా అలంకరించిన దృశ్యం మధ్యప్రదేశ్‌లో.. బుధవారం నుంచి 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఇప్పటికే అక్కడ ప్రత్యక్ష బోధన(Direct classes) కొనసాగుతోంది. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు.
కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా..
రాజస్థాన్ ప్రభుత్వం 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు పాఠశాలలను తిరిగి ప్రారంభించింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు , కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లు కూడా తెరిచారు. 50 శాతం మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని ప్రభుత్వ స్పష్టం చేసింది.
తమిళనాడులోనూ 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులు బడులకు హాజరయ్యారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించారు.
తమిళనాడులో పాఠాలు వింటున్న విద్యార్థులు రాజస్థాన్‌లో క్లాసులు వింటున్న స్టూడెంట్స్ హరియాణాలో 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరిచారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రం తీసుకురావడం తప్పనిసరి చేశారు. పుదుచ్చేరిలో 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు.. తరగతులను 50 శాతం సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:breakthrough infection: 'టీకా తీసుకున్న 25శాతం ఆరోగ్య సిబ్బందికి కరోనా'