Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుక నుంచి వస్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారి సహా ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఛింద్వాడా జిల్లాలోని కొడమావు గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఓ బైక్ రైడర్‌ను తప్పించే ప్రయత్నంలో బొలేరో అదుపుతప్పి లోయలో పడిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. బాధితులంతా.. భాజీపానీ గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నారని ఆయన చెప్పారు. బావిలో పడి వాహనం ఇరుక్కుపోయిందని, క్రేన్ సాయంతో బయటకు తీశామన్నారు.
పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం.. లోయలో పడిన కారు.. ఏడుగురు మృతి - మధ్యప్రదేశ్ వార్తలు
accident
11:14 June 16
పెళ్లివేడుక నుంచి వస్తూ లోయలో పడిన కారు.. ఏడుగురు మృతి
Last Updated : Jun 16, 2022, 12:21 PM IST