తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇంటిని అందంగా చేద్దామనుకున్నారు.. అంతలోనే ప్రాణాలు... - కాన్పుర్​ న్యూస్​

దీపావళి పండుగ ముందు ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మట్టిదిబ్బలు కూలి.. ఇద్దరు మృతిచెందారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

many people buried after mud mound collapsed in ghatampur kanpur
మట్టిదిబ్బలు పడి పలువురు మృతి

By

Published : Oct 27, 2021, 3:09 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో ఘోరం జరిగింది. మవునఖత్​ గ్రామంలోని ఘాటంపుర్​లో మట్టిదిబ్బలు పడి ఇద్దరు మహిళలు మృతిచెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మొత్తం 8 మంది మట్టిలో కూరుకుపోగా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు.

దీపావళి పండుగ నేపథ్యంలో.. ఇళ్లను అందంగా తీర్చిదిద్దాలని భావించిన మహిళలు మట్టిని తవ్వి తెచ్చేందుకు కొండ ప్రాంతంలోకి వెళ్లారు. కొందరు తమ పిల్లలను కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మట్టిదిబ్బలు కూలి ప్రమాదం సంభవించింది.

ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఇదీ చూడండి: Lakhimpur Kheri Violence : లఖింపుర్​ ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details