తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్వాతారోహకులపై హిమపంజా.. 10 మంది మృతి.. రంగంలోకి ఆర్మీ.. - ఉత్తరాఖండ్ ప్రమాదం

ఉత్తరాఖండ్​ ఉత్తరకాశీలో హిమపాతంలో చిక్కుకొని 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందిని సహాయక సిబ్బంది కాపాడారు.

many-mountaineers-stuck
many-mountaineers-stuck

By

Published : Oct 4, 2022, 4:40 PM IST

Updated : Oct 4, 2022, 5:32 PM IST

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. హిమపాతంలో చిక్కుకొని 10 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మందిని సహాయ సిబ్బంది కాపాడారు. హిమపాతంలో చిక్కుకున్న మరో 23 మంది కోసం గాలింపు చేపట్టినట్లు తెలుస్తోంది. ద్రౌపది దండా-2.. పర్వత శిఖరంపై ఈ ప్రమాదం జరిగింది.

బాధితులంతా.. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటైనరింగ్‌(ఎన్​ఐఎమ్​)కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎన్​ఐఎమ్​ ప్రిన్సిపల్‌ కల్నల్‌ అమిత్‌ బిష్ట్‌.. 34 మంది ట్రైనీలు, 7 బోధకులు పర్వతారోహణకు వెళ్లినట్లు చెప్పారు. వారు శిఖరం పైనుంచి తిరిగి వస్తుండగా.. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు హిమపాతం సంభవించినట్లు తెలిపారు. హిమపాతం కింద చిక్కుకున్న వారిలో 8మందిని గుర్తించి తమ బృందం రక్షించినట్లు ఉత్తరకాశీ విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్‌ తెలిపారు.

భూమికి 14వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకులు ప్రమాదానికి గురికాగా.. మిగిలిన వారి కోసం ఆర్మీ హెలికాఫ్టర్లతో గాలిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ తెలిపారు. సహాయ చర్యల్లో ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్, బీఎస్​ఎఫ్, ఐటీబీపీ బలగాలు పాల్గొన్నట్లు.. ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి వెల్లడించారు.

ఇవీ చదవండి:ఆ వర్గాలకు ఎస్టీ హోదా.. త్వరలోనే రిజర్వేషన్.. అమిత్ షా గుడ్​న్యూస్

ఉచిత హామీలపై ఈసీ ఆందోళన.. రాజకీయ పార్టీలకు లేఖ.. ఆ వివరాలు చెప్పాలని ఆదేశం!

Last Updated : Oct 4, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details