తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిద్ర మత్తులో డ్రైవర్.. బస్సును ఢీకొని SUVలోని 11 మంది మృతి - బేతుల్​ రోడ్డు ప్రమాదం మధ్యప్రదేశ్​

బస్సు, టవేరా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. ఒకరు గాయపడ్డారు. మధ్యప్రదేశ్​ బేతుల్ జిల్లాలో శుక్రవారం జరిగిందీ దుర్ఘటన.

Madhya Pradesh road accident today
ఘోర ప్రమాదం

By

Published : Nov 4, 2022, 8:39 AM IST

Updated : Nov 4, 2022, 9:36 AM IST

మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించగా.. ఒకరు గాయపడ్డారు. ఓ బస్సు, ఎస్​యూవీ(టవేరా) ఎదురెదురుగా వచ్చి ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. మృతులంతా టవేరాలో ప్రయాణిస్తున్నవారే. ప్రమాదానికి గురైన టవేరాలో మొత్తం 12 మంది ఉన్నారు. వీరంతా కూలీలే అని పోలీసులు తెలిపారు.

శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలు సమయంలో జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న భైన్స్​దేహి రహదారిపై.. పరత్​వాడా వైపు వెళ్తున్న టవేరా.. బేతుల్​వైపు వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. 11 మంది అక్కడికక్కడే మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఐదేళ్ల చిన్నారి, ఒక పసిబిడ్డ అక్కడికక్కడే మృతి చెందారని​ ఎస్సై శివరాజ్​ సింగ్​ ఠాకూర్ తెలిపారు.

నుజ్జునుజ్జయిన కారు

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు బేతుల్ జిల్లా ఝల్లాల్​ పోలీస్​ స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, స్థానికులు కలిసి వాహనం నుంచి 7 మృతదేహాలు వెలికితీశారు. మరో 4 మృతదేహాలు కారులో చిక్కుకుపోగా.. కట్టర్​ల సాయంతో వాహనాన్ని ముక్కలు చేసి బయటకు తీయాల్సి వచ్చింది. ఎస్​యూవీ డ్రైవర్​ నిద్రలోకి జారుకోవడమే ఈ పెను విషాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు పరిహారం ప్రకటించారు.

బస్సును ఢీకొన్న టవేరా
Last Updated : Nov 4, 2022, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details