Manipur Violence Latest Updates : జాతుల మధ్య వైరంతో గత మూడు నెలలుగా మణిపుర్ అల్లకల్లోలమవుతోంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న మణిపుర్ అసెంబ్లీ సమావేశాలకు పార్టీలకు అతీతంగా కుకీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు హాజరు కాబోరని ఆయా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా.. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం సాధ్యం కాదని చురచంద్పుర్ బీజేపీ ఎమ్మెల్యే ఎల్ఎమ్ ఖౌటే అన్నారు. హింస, ప్రత్యేక పరిపాలన కోసం కుకీలు చేసిన డిమాండ్లకు పరిష్కారం లేకపోవడం వల్ల తమ వర్గం ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని తెలిపారు.
Manipur Violence Latest News : 'ఇంఫాల్‌కు ఎమ్మెల్యేలు సురక్షితంగా ప్రయాణించలేరు.. థాన్లోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే వుంగ్‌జాగిన్.. వాల్టేపై అక్కడే దారుణంగా దాడి చేశారు. ఆయన ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు' అని కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపేఏ) అధ్యక్షుడు టోంగ్‌మాంగ్ హౌకిప్ తెలిపారు. 60 స్థానాలున్న మణిపుర్‌లో శాశనసభలో బీజేపీకి చెందిన ఏడుగురు, కుకీ పీపుల్స్ అలయన్స్‌కు చెందిన ఇద్దరు, ఒక స్వతంత్రుడితో సహా మొత్తం 10 మంది కుకీ-జోమీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కుకీ ఎమ్మెల్యేలు లేకుండా అల్లర్లపై అర్ధవంతమైన చర్చ జరిగే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్డీయేకు కేపీఏ మద్దతు ఉపసంహరణ..
Kuki Peoples Alliance Mla : రాష్ట్రంలో అల్లర్ల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామి కుకీ పీపుల్స్ అలయన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ బిరేన్ సింగ్ ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఈ పార్టీ.. ఈ మేరకు గవర్నర్‌కు లేఖ రాసింది. 'ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా.. ఎన్ బిరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సహేతుకం కాదు. ఇక నుంచి కేపీఏ మద్దతు మణిపుర్ప్రభుత్వానికి ఉండదు' అని లేఖలో పేర్కొంది.
కర్ఫ్యూ సడలింపు..
Manipur Violence Curfew News : పశ్చిమ ఇంఫాల్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆగస్టు 7వ తేదీ ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. అత్యవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రజలు ఆరోడు వీలు కల్పించనున్నారు. ఈ మేరకు పశ్చిమ ఇంఫాల్ డీఎమ్ వివరాలు వెల్లడించారు.