Manipur Bus Accident : మణిపుర్‌లోని నోనీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజ్ఞానయాత్రకు వెళ్లిన విద్యార్థుల రెండు బస్సులు.. ప్రమాదానికి గురయ్యాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 15 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే మరణాలపై అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఘటనలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
స్కూల్ విద్యార్థుల బస్సులకు ఘోర ప్రమాదం.. 15 మంది మృతి! - manipur school bus tragedy
విజ్ఞాన యాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సులకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయినట్లు సమచారం. మణిపుర్లో జరిగిందీ ఘటన.
![స్కూల్ విద్యార్థుల బస్సులకు ఘోర ప్రమాదం.. 15 మంది మృతి! Manipur Bus Accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17269993-thumbnail-3x2-eee.jpg)
పోలీసుల సమాచారం ప్రకారం..జిల్లాలోని యారిపోక్లో ఉన్న తంబలను ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం రెండు బస్సుల్లో ఖౌపుమ్‌కు బయలుదేరారు. లోంగ్సాయి టుబుంగ్ గ్రామ సమీపంలో బిష్ణుపర్-ఖౌపుమ్ రహదారిపై రెండు బస్సులకు ప్రమాదం జరిగింది. ఘటనలో గాయపడిన విద్యార్థులను తొలుత బిష్ణుపుర్ జిల్లాకు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని మెడిసిటీ హాస్పిటల్లో చేర్పించారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆయన.. ఘటనాస్థలిలో సహాయకచర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.