తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Manipur incident : 'దేశాన్ని రక్షించా.. భార్యను కాపాడుకోలేకపోయా'.. కార్గిల్ వీరుడి ఆవేదన - మణిపుర్​ లేటెస్ట్​ వార్త్

Manipur Woman Paraded : మణిపుర్‌లో వివస్త్రలను చేసి ఊరేగించిన ఇద్దరు మహిళల్లో ఒకరి భర్త కార్గిల్‌ వీరుడిగా అధికారులు గుర్తించారు. దేశం కోసం పోరాడిన తాను.. తన ఇంటిని, భార్యను, గ్రామాన్ని కాపాడుకోలేకపోవటం బాధగా ఉందని బాధితురాలి భర్త ఆవేదన వ్యక్తం చేశారు.

manipur victim husband
manipur victim husband

By

Published : Jul 22, 2023, 9:51 AM IST

Manipur Woman Paraded : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనలో బాధితురాలు ఓ మాజీ సైనికుడి భార్య అని తెలిసింది. ఈ ఘటనపై ఆ బాధిత మహిళ భర్త, మాజీ సైనికుడు స్పందించారు. కార్గిల్‌ యుద్ధంలో దేశాన్ని రక్షించుకున్నప్పటికీ.. ఈ అమానవీయ ఘటన నుంచి మాత్రం తన భార్యను కాపాడుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

'దేశం కోసం పోరాడిన నేను..'
Manipur Woman Paraded Victim Husband : "కార్గిల్‌ యుద్ధంలో దేశం కోసం పోరాడాను. దీంతోపాటు ఇండియన్‌ పీస్‌ కీపింగ్‌ ఫోర్స్‌లో భాగంగా శ్రీలంకలోనూ పనిచేశాను. ఇలా దేశం కోసం పోరాడిన నేను.. నా ఇంటిని, భార్యను, గ్రామస్థులను మాత్రం కాపాడుకోలేకపోయాను. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది. కుంగుబాటుకు గురిచేస్తోంది" అంటూ బాధితురాలి భర్త, మాజీ సైనికుడు విలపించారు.

'నిందితులకు కఠిన శిక్ష విధించాలి'
Manipur Victim Husband Army : "మే 4న తమ గ్రామంపై దాడి చేసిన ఆ మూక.. అనేక ఇళ్లకు నిప్పు పెట్టింది. అనంతరం ఇద్దరు మహిళలను ప్రజల ముందే వివస్త్రను చేసి ఊరేగించారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ దుండగులకు కఠిన శిక్ష విధించాలి" అని ఆ కార్గిల్‌ వీరుడు డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ ఆర్మీలో పనిచేసిన ఆయన.. అసోం రెజిమెంట్‌లో సుబేదార్‌గా సేవలందించినట్లు సమాచారం.

నిందితుడి ఇంటికి నిప్పు..
Manipur Culprit Arrested : ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ మైతేయ్​ ఇంటిని శుక్రవారం ఉదయం కొందరు వ్యక్తులు తగలబెట్టేశారు. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్‌ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్థులు టైర్లతో కాల్చేశారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆ రోజు ఏం జరిగింది?
Manipur Woman Paraded Video : ఈ దారుణ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం.. మైతేయ్‌ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ఆరోపణలపై కొందరు యువకులు కుకీ వర్గానికి చెందిన గ్రామాలపై దాడులకు ఉపక్రమించారు. ఈ క్రమంలో తమ ఊరి మీదికి కూడా మైతేయ్‌ల గుంపు దాడి చేయనుందనే సమాచారంతో.. మే 4వ తేదీన బీ.ఫయనోమ్‌ గ్రామానికి చెందిన కుకీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు సురక్షిత ప్రాంతానికి పారిపోయేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఓ 50 ఏళ్ల వ్యక్తి, అతడి కుమారుడు (19), కుమార్తె (21) ఒకే కుటుంబం కాగా.. మరో ఇద్దరు ఇతర మహిళలు ఉన్నారు. అదే సమయంలో వారికి నాంగ్‌పోక్‌ సెక్మై వద్ద పోలీసులు కనిపించడం వల్ల వారి వద్దకు వెళ్లారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ లింక్​పై క్లిక్ చేసి చదివేయండి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details