Manipur Elections 2022: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభం అయింది. 5 జిల్లాల పరిధిలోని 38 స్థానాల్లో 173 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సీఎం బీరేన్ సింగ్ ఎన్నికల కోసం పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు తొలి విడతలో మణిపుర్ సీఎం బీరేన్ సింగ్, ఉపముఖ్యమంత్రి జాయ్‌కుమార్ సింగ్, స్పీకర్ వై. కేమ్‌చంద్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ లోకేశ్ సింగ్ బరిలో ఉన్నారు.
ఈసీ అధికారుల ఏర్పాట్లు పూర్తి ఓటేసిన తర్వాత ఓ మహిళ ఆనందం ఓటేసేందుకు క్యూలో నిల్చున్న పౌరులు అయితే మణిపూర్ తొలివిడత ఎన్నికలు ఆదివారమే జరగాల్సి ఉంది. కానీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి కాకపోవడం వల్ల సోమవారానికి వాయిదా పడ్డాయి. మణిపూర్‌లోని 60 స్థానాలకు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 5న మణిపుర్‌లో 22 స్థానాలకు రెండో విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:ఆ చట్టం చుట్టే మణిపుర్ రాజకీయాలు!