Manhole Cleaning Robot : మ్యాన్‌హోల్ ఈ పేరు వినగానే కొందరికి భయం వేస్తుంది. మరికొందరైతే మ్యాన్‌హోల్ కనిపిస్తే ముక్కు మూసుకుంటారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు.. వాటి లోపలికి దిగి శుభ్రం చేస్తారు. మురుగును శుభ్రం చేసే క్రమంలో విష వాయువులు విడుదలై పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదాల బారినపడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు చండీగఢ్ కార్పోరేషన్ అధికారులు సరికొత్త ఉపాయం చేశారు.
Manhole Bandicoot Cleaning Robot : పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్‌లో మ్యాన్ హోల్స్ శుభ్రం చేసేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. కార్మికులు ఆ పని చేస్తుండగా ప్రమాదాలు జరగటం వల్ల 'బ్యాండికూట్' అనే రోబోలకు అప్పగించారు. ఈ రోబోలు మురుగును శుభ్రం చేస్తుండగా వాటి నిర్వహణ బాధ్యతను పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. రోబోలను నిర్వహించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు.
360 డిగ్రీల..
Bandicoot Sewage Cleaning Robot : బ్యాండికూట్ రోబో యంత్రం అధునాతన సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ రోబోకు 360 డిగ్రీల పరిధిలో నాలుగు కెమెరాలు ఉంటాయి. అంతేకాదు మ్యాన్‌హోల్స్‌లో విష వాయువులను గుర్తిస్తుంది. మురుగు కాలువలోని ప్రతిమూలా శుభ్రం చేస్తుంది. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మ్యాన్‌హోల్స్ శుభ్రంచేసే పనిని ఇప్పుడు రోబోలతో చేయిస్తున్నారు.