తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2022, 10:07 PM IST

ETV Bharat / bharat

మాజీ సహోద్యోగిపై కోపం.. పబ్లిక్ టాయిలెట్లలో అలా..!

Mangalore professors arrest: మాజీ సహోద్యోగి వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ టాయిలెట్​లపై పోస్టర్లుగా అంటించారు ముగ్గురు వ్యక్తులు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Mangaluru professors arrest
పబ్లిక్ టాయిలెట్​లో పోస్టర్​లు

Mangalore professors arrest: మాజీ సహోద్యోగి వ్యక్తిగత సమాచారాన్ని పబ్లిక్ టాయిలెట్​లపై పోస్టర్లుగా అంటించారు ముగ్గురు వ్యక్తులు. తన పరువుకు నష్టం కలిగేలా సందేశాలు రాసి అంటించారని బాధితురాలు కర్ణాటక మంగళూరు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఇద్దరు ప్రొఫెసర్లు సహా మొత్తం ముగ్గురు నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. కళాశాల అడ్మినిస్ట్రేషన్ హెడ్ ప్రకాష్ షెనాయ్ (44), ప్రదీప్ పూజారి (36), బి.ఎస్. శెట్టిని (32) నిందితులుగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు తమ మాజీ సహోద్యోగి అయిన బాధితురాలి వ్యక్తిగత వివరాలను పబ్లిక్ టాయిలెట్​పై పోస్టర్​లుగా అంటించారు. బాధితురాలి సెల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటివి ఈ పోస్టర్​లో బహిర్గతం చేశారు. శివమొగ్గ, సులియా, సుబ్రమణ్య, సంపాజే, మదికేరి, మైసూరు, చిక్కమగళూరు, ముదిగెరె, బాలెహోన్నూరు, ఎన్‌.ఆర్‌.పురలోని అన్ని బస్టాండ్ల పబ్లిక్ టాయిలెట్లపై ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

బంట్వాళ నగరంలోని ఓ ప్రముఖ కళాశాలలో కన్నడ అధ్యాపకురాలిగా బాధితురాలు పనిచేసేది. యజమాన్యంతో గొడవల కారణంగా అక్కడ ఉద్యోగం మానేసి వేరొక కళాశాలలో చేరింది. దీంతో బాధితురాలిపై పగ పెంచుకున్న పాత కళాశాల యజమాన్యం ఆమెను అప్పటి నుంచి వేధింపులకు గురిచేస్తోంది. పబ్లిక్ టాయిలెట్లపై ఆమె పరువుకు భంగం కలిగించేలా రాతలు రాయడంపై బాధితురాలు.. మంగళూరు మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇదీ చదవండి:అసలే భార్యను కోల్పోయిన బాధ.. ఆపై మూకదాడి.. యువకుడు మృతి

ABOUT THE AUTHOR

...view details