కర్ణాటక మంగళూరు జిల్లా సుల్యాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అరంతోడ్ గ్రామంలోని అద్దేల్-నెక్కారే అడవి. అందులో ప్రయాణిస్తుంటే ప్లాస్టిక్ కవర్ కప్పిన ఓ చిన్న గుడిసె తారసపడుతుంది. దానిలోపల ఆ రోజుల్లోనే లగ్జరీ వెహికిల్‌గా పేరొందిన 'ప్రీమియర్ పద్మిని కారు', ఓ రేడియో, పాత సైకిల్ దర్శనమిస్తాయి. అలాగే ఆ గుడిసెలోనే మాసిన గడ్డం, పాత బట్టలు, అరిగిపోయిన చెప్పులతో ఓ వ్యక్తి దర్శనమిస్తాడు అతడే 56 ఏళ్ల చంద్రశేఖర్!
ఎంత ఆదాయం వచ్చినా.. విలాసవంతంగా జీవించాలని అనుకుంటున్న రోజులివి. అయితే అప్పట్లోనే సొంత కారు ఉండి.. ఉన్నంతలో లగ్జరీ జీవితాన్ని గడిపే.. ఆ వ్యక్తి అనూహ్యంగా ఎందుకు అడవిలోకి మకాం మార్చాల్చి వచ్చింది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లుగా అడవిలోనే అతడు ఎందుకు నివాసం ఉంటున్నాడు?
అసలు కథ ఇదీ..
చంద్రశేఖర్‌కు గతంలో నెక్రల్-కెమ్రాజీ అనే గ్రామంలో 1.5 ఎకరాల పొలం ఉండేది. దానిని సాగు చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవాడు. అయితే 2003 సంవత్సరంలో సహకార బ్యాంకు నుంచి రూ. 40వేల రుణం తీసుకున్నాడు. ఆ బాకీ తీర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దానిని చెల్లించలేకపోయాడు. దీంతో అతని పొలాన్ని బ్యాంక్ వేలం వేసింది. ఇది భరించలేని చంద్రశేఖర్ తనకిష్టమైన 'ప్రీమియర్ పద్మిని కారుతో' సోదరి వద్దకు వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తరువాత తన సోదరి కుటుంబంతో విభేదాలొచ్చాయి. దీంతో సొంత గ్రామానికి వెళ్లలేక.. ఆత్మగౌరవం అడ్డొచ్చి.. తనకెంతో ఇష్టమైన కారుతో అడవిలోనే ఒంటరిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఓ చోట కారును నిలిపి.. వర్షం, ఎండ నుంచి దానిని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్ కప్పాడు.
ఉత్సాహ జీవితం..
అడవిలో ఒంటరిగా జీవిస్తున్న చంద్రశేఖర్ వద్ద పాత సైకిల్‌తో పాటు.. ఓ రేడియో కూడా ఉంది. పాత హిందీ మెలోడీ పాటలను ఇష్టంగా వినే అతను.. జీవనోపాధి కోసం బుట్టలు తయారు చేసి.. సమీప గ్రామంలో విక్రయిస్తుంటాడు. వీటికి బదులుగా చిల్లర సరుకులు తీసుకుంటానని చెప్పాడు.
జంతువులతో హాని లేదు..